నదులు, వాగుల్లో అనుమతి లేకుండా ఇసుక తవ్వకాలతో పర్యావరణం దెబ్బతినడమే కాకుండా భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయి. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని ఇసుక అవసరాలు ఎక్కువ ఉన్న చోట సబ్ స్టాక్ యార్డులను ఏర్పాటు చేసి విక్రయిస్తున్నట్లు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి అన్నారు. టన్ను ఇసుక రూ.1,200గా నిర్ణయించామని, అవసరం ఉన్న వారు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలని సూచించారు.
శనివారం ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెదక్‌లో ఏర్పాటు చేసిన ఇసుక విక్రయ కేంద్రాన్ని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. గత ప్రభుత్వాల హయాంలో ఇసుక విక్రయాలతో రూ.10 కోట్ల ఆదాయం వచ్చేదని, తెరాస సర్కారు అధికారంలోకి వచ్చాక ఏటా రూ.2,600 కోట్ల ఆదాయం సమకూరుతోందన్నారు.