ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి తన పుట్టినరోజు వేడుకలను మెదక్ టీఎన్జీఓ భవన్లో జరుపుకున్నారు. అభిమానుల మధ్య కేక్ కట్ చేశారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్సీ ప్రారంభించారు. కార్యకర్తలు, నాయకులు, సర్పంచులు రక్తదానం చేశారు. తన సొంత గ్రామం కుచన్‌పల్లిలో గ్రామస్థులతో కలిసి మొక్కలు నాటారు. టీఎన్జీవో సంఘ సభ్యులు, ప్రజలు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్సీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఘనంగా ఎమ్మెల్సీ సుభాష్‌రెడ్డి జన్మదిన వేడుకలు - శేరి సుభాష్ రెడ్డి
ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి 57వ జన్మదిన వేడుకలు మెదక్ టీఎన్జీవో భవన్లో ఘనంగా జరిగాయి.
ఘనంగా ఎమ్మెల్సీ సుభాష్‌రెడ్డి జన్మదిన వేడుకలు