తెలంగాణ

telangana

ETV Bharat / state

కొండపోచమ్మ నిర్వాసితులకు చెక్కులు పంచిన ఎమ్మెల్యే సోలిపేట - భూనిర్వాసితులకు చెక్కుల పంపిణీ

కొండపోచమ్మ రిజర్వాయర్​ కాలువల నిర్మాణంలో భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చెక్కులు పంపిణీ చేశారు. వేలాది ఎకరాలు సాగులోకి వస్తాయని ఆలోచించి.. కాలువల నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతుల త్యాగం వెలకట్టలేనిదని ఎమ్మెల్యే తెలిపారు.

MLA Solipeta Ramalinga Reddy Distributes Cheques
నిర్వాసితులకు చెక్కులు పంచిన ఎమ్మెల్యే

By

Published : Jun 14, 2020, 7:43 PM IST

మెదక్​ జిల్లాకు చెందిన చేగుంట మండలం పులిమామిడి, కిష్టాపూర్​ గ్రామాల్లో కొండపోచమ్మ రిజర్వాయర్​ కాల్వల నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చెక్కులు పంపిణీ చేశారు. రిజర్వాయర్​, కాల్వల నిర్మాణం కోసం భూములు త్యాగం చేసిన రైతుల త్యాగాలను మరువలేనివని ఎమ్మెల్యే అన్నారు. రైతుల త్యాగ ఫలితంగానే ఈ ప్రాంతం త్వరలోనే సస్యశ్యామలం కాబోతుందన్నారు. భూ నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ముఖ్యమంత్రి రైతుల సంక్షేమం కోసం నిరంతరం ఆలోచిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details