మెదక్ జిల్లా డ్చన్పల్లి, యూస్పేట, కుర్తివాడ, లక్ష్మినగర్ గ్రామాల్లో పీఏసీఎస్, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 41 కిలోల కంటే ఎక్కువ తూకం వేయొద్దని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు.
రైతులు ఆరుగాలం పండించిన పంటను దళారులకు అమ్మి నష్టపోకూడదనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పంటకు మద్దతు ధర కల్పించినట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు తాలు లేకుండా వడ్లు తీసుకురావాలని రైతులకు సూచించారు. గన్ని బ్యగులు లారీల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటిస్తూ కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకురావాలన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే - తెలంగాణ తాజా వార్తలు
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 41 కిలోల కంటే ఎక్కువ తూకం వేయొద్దని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. ఆదివారం పోడ్చన్పల్లి, యూస్పేట, కుర్తివాడ, లక్ష్మినగర్ గ్రామాల్లో పీఏసీఎస్, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఆమె ప్రారంభించారు.
పద్మా దేవేందర్ రెడ్డి
ఇదీ చదవండి:కేఎల్ రాహుల్కు తన ప్రేయసి స్పెషల్ విషెస్!