తెలంగాణ

telangana

ETV Bharat / state

గోదావరి జలాలకు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పూజలు - MLA Padma Devender Reddy worships Godavari waters

మెదక్ జిల్లా కుఛన్​పల్లి చెక్​ డ్యామ్ వద్ద ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి గోదావరి జలాలకు పూజలు చేశారు. మండుటెండల్లో మంజీరా నది గలగలపారుతుండడం అద్భుత దృశ్యమని పేర్కొన్నారు.

గోదావరి జలాలకు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పూజలు
గోదావరి జలాలకు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పూజలు

By

Published : Apr 23, 2021, 1:27 PM IST

గతంలో నీళ్ల కోసం విలవిలలాడిన మెతుకు సీమ… నేడు గోదావరి నీళ్లతో కళకళలాడుతుందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్​ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా హవేలీ ఘన్​పూర్ మండలం కుఛన్​పల్లి చెక్​ డ్యామ్ వద్ద గోదావరి జలాలకు హారతిచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ జిల్లా ఆంధ్ర పాలకుల నిర్లక్ష్యానికి గురైందని… సింగూరు నీళ్లు హైదరాబాద్ నగరానికి తరలించారని మండిపడ్డారు. అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి హరీశరావు చొరవతో కాళేశ్వరం నుంచి గోదావరి జలాలు మంజీరాలో ప్రవహిస్తున్నాయని కొనియాడారు. మండుటెండల్లో మంజీర నది గలగలపారుతుండడం అద్భుత దృశ్యమని అన్నారు.

ఇదీ చదవండి:కరోనా రోగుల రక్తాన్ని తాగుతున్న కార్పొరేట్​ ఆస్పత్రులు!

ABOUT THE AUTHOR

...view details