మెదక్ జిల్లాలో హవేలి ఘనపూర్ మండల సమీపంలోని పొలాల్లో స్థానిక మహిళలలతో కలిసి ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి నాట్లు వేశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవాలని సూచించారు. ఇటీవల కురిసిన వర్షాలకు కుచన్‌పల్లి గ్రామ శివార్లలో మంజీరా నదిపై నిర్మించిన చెక్‌డ్యాం నిండుకుండని తలపిస్తుండంపై ఆనందం వ్యక్తం చేశారు. స్థానిక ఎంపీపీ నారాయణరెడ్డితో కలిసి చెక్‌డ్యాం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పొలాల్లో నాట్లువేసిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి
మెదక్ జిల్లాలో హవేలిఘనపూర్ మండల సమీపంలోని పొలాల్లో స్థానిక మహిళలతో కలిసి ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి నాట్లు వేశారు.
పొలాల్లో నాట్లువేసిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి