తెలంగాణ

telangana

చదువుతోపాటు క్రీడలూ అవసరమే: ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి

By

Published : Jan 31, 2021, 7:19 PM IST

చదువుతోపాటు క్రీడలూ అవసరమేనని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. ఆటలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని పేర్కోన్నారు. మెదక్ చాంపియన్స్ లీగ్ టోర్నమెంట్ ఫైనల్​కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

MLA presenting prizes to the winners
విజేతలకు బహుమతులు అందజేస్తున్న ఎమ్మెల్యే

భవిష్యత్తులో క్రీడాకారులను ప్రోత్సహించేలా ప్రతి ఏడాది స్పోర్ట్స్ మీట్ పెట్టడానికి ప్రణాళిక తయారు చేస్తున్నామని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. చదువుతోపాటు ఆటలూ అవసరమేనని పేర్కొన్నారు. మెదక్ జూనియర్ కళాశాల్లో జరుగుతున్న చాంపియన్స్ లీగ్ టోర్నమెంట్ ఫైనల్​కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఆటలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని ఎమ్మెల్యే అన్నారు. క్రీడాకారులను అభినందించి విజేతలకు బహుమతులు అందజేశారు. మెదక్ పట్టణంలో మంచి ప్లేగ్రౌండ్ కావాలని యువత కోరినట్లు తెలిపారు.

భవిష్యత్తులో వారికి ప్లేగ్రౌండ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని హామీ ఇచ్చారు. త్వరలో స్పోర్ట్స్ మీట్​ ఏర్పాటు చేసి జిల్లాలోని అన్ని టీంలను పిలిచి మంచి కార్యక్రమం తలపెడతామన్నారు.

ఇదీ చూడండి:'అగ్రకులాల పేదల రిజర్వేషన్ల జీవో బాధ్యత నాది'

TAGGED:

ABOUT THE AUTHOR

...view details