పల్లెలు, పట్టణాలు పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వంటి కార్యక్రమాలను సీఎం కేసీఆర్ తీసుకొచ్చారని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తెలిపారు. మెదక్ పట్టణంలో పలు వార్డుల్లో రూ.కోటి 28 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. 70 ఏళ్ల నుంచి పల్లెలను ఎవరూ పట్టించుకోలేదని విమర్శించారు.
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం కోసమే డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు వంటి కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందిస్తున్నామని ఆమె తెలిపారు. పట్టణంలో ఇళ్ల స్థలాలు ఉన్న వారికి ఇల్లు కట్టుకోవడానికి అనుమతి ఇస్తామని... స్థలం లేని వారికి రెండు పడక గదుల ఇళ్లు కేటాయిస్తామన్నారు.