మెదక్ చర్చి క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఏసుప్రభు దయవల్ల తెలంగాణ వచ్చిందని, రాష్ట్రం సిద్ధించడానికి క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారని అన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.
ఏసుప్రభు దయతో తెలంగాణ వచ్చింది: పద్మా దేవేందర్ రెడ్డి - MLA Padma Devender Reddy latest news
మెదక్ చర్చి క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారని అన్నారు. చర్చి అభివృద్ధికి పాటుపడతామని తెలిపారు.
మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు
కరోనా నుంచి రాష్ట్ర ప్రజలను ఏసుప్రభు కాపాడాలని కోరుకుంటున్నా. మహా దేవాలయం ప్రాంగణంలో సీసీ రోడ్లు, వీధిదీపాలు ఏర్పాటు చేశాం. చర్చి అభివృద్ధికి మరిన్ని మౌలిక వసతులు కల్పిస్తాం.
- పద్మా దేవేందర్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే
ఏసు స్మరణం..
క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. వేకువజామునుంచే ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. బిషప్ రైట్ రెవరెండ్ ఏసీ సాల్మన్ రాజు.. ఉదయం ప్రార్థనలో పాల్గొని భక్తులకు దైవ సందేశాన్ని అందించారు. జనం పెద్ద ఎత్తున మహా దేవాలయంకు తరలివచ్చి కొవ్వొత్తులు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.