తెలంగాణ

telangana

ETV Bharat / state

పల్లెల పరిశుభ్రతతోనే అది సాధ్యం: పద్మా దేవేందర్ రెడ్డి - మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్​ రెడ్డి

పల్లెలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన తెలంగాణ కల సాకారమవుతుందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్​ రెడ్డి అన్నారు. ప్రశాంత వాతావరణం కల్పించాలనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి పనులు చేపట్టారని తెలిపారు. హవేలిఘన్​పూర్​ మండలం బూర్గుపల్లిలో పల్లె ప్రకృతి వనాన్ని ఆమె ప్రారంభించారు.

MLA padma devender reddy
MLA padma devender reddy

By

Published : Jun 21, 2021, 6:50 PM IST

గ్రామాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టారని మెదక్​ ఎమ్మెల్యే పద్మా దేవేందర్​ రెడ్డి పేర్కొన్నారు. పల్లెలు, పట్టణాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన తెలంగాణ సాధ్యమని తెలిపారు. జిల్లాలోని హవేలి ఘన్​పూర్ మండలం బూర్గుపల్లిలో పల్లె ప్రకృతి వనం, సీసీ రోడ్డు, వైకుంఠధామాన్ని ఆమె ప్రారంభించారు.

రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేశారన్నారు. అందులో భాగంగానే పల్లె ప్రకృతి వనం, 24 గంటల విద్యుత్, రైతుబంధు లాంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో డంపింగ్ యార్డు ఏర్పాటు చేసి చెత్త, చెదారాన్ని సేకరించడం జరిగిందన్నారు. ప్రజలకు మంచినీళ్లు అందించడం కోసం మిషన్ భగీరథ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు.

పల్లెల్లో అన్ని సౌకర్యాలు ఉండాలనే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. తెలంగాణ ఆవిర్భవించాక అభివద్ధిలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. కరోనా మహమ్మారిని నిర్మూలించాలంటే ముఖ్యంగా పల్లెలన్నీ పరిశుభ్రంగా ఉండాలని సూచించారు. ప్రతి గ్రామంలో వైకుంఠధామాలు ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్​కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాస్, జడ్పీ వైస్​ ఛైర్మన్ లావణ్య రెడ్డి, హావేలి ఘన్​పూర్ మండలం ఎంపీపీ శేరి నారాయణ రెడ్డి, సర్పంచ్ చెన్నయ్య, కార్యకర్తలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

పల్లెలను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ పని చేస్తున్నారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలి. డంప్​యార్డులు ఏర్పాటు చేసి పల్లెలు, పట్టణాల్లో పరిశుభ్రత ఉంచేలా చర్యలు తీసుకుంటున్నాం. పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు నిర్మిస్తున్నాం. గ్రామాల అభివృద్ధే దేశాభివృద్ధికి మూలం. సీఎం చొరవతో గ్రామాల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం. దేశంలోనే తెలంగాణ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. - పద్మా దేవేందర్​ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే


ఇదీ చూడండి:KCR: వరంగల్​లో కేసీఆర్​.. కలెక్టరేట్​ ప్రారంభం, మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి భూమి పూజ

ABOUT THE AUTHOR

...view details