MLA Padma Devender Reddy Election Campaign at Medak :ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలే బీఆర్ఎస్(BRS)పార్టీని గెలిపిస్తాయని.. మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ గొల్పర్తి, కోమట్‌పల్లి, కోమటిపల్లి తండా, రామాయంపేట తండాలో పర్యటించారు. ఆమెకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.
BRS Manifesto Schemes: బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో సంక్షేమ పథకాలను పద్మా దేవేందర్ రెడ్డి ఓటర్లకు వివరించారు. కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. సీఎం కేసీఆర్ మెదక్ వచ్చినప్పుడు రామాయంపేట రెవెన్యూ డివిజన్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పట్టణ అభివృద్ధికి రూ.54 కోట్లు మంజూరు చేశారని గుర్తు చేశారు. ఆ నిధులతోనే రామాయంపేట ప్రధాన రహదారి నిర్మాణం చేపట్టామన్నారు.
'సంపద పెంచాలి- పేదలకు పంచాలనేదే కేసీఆర్ సిద్ధాంతం'
Telangana Assembly Elections 2023 : ఒకవైపు సంక్షేమ పథకాల అమలు.. మరోవైఫు సమ్మిళిత అభివృద్ధితో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని ఆమె అన్నారు. 3 గంటల కరెంటు సరిపోతుందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. రాష్ట్రం అంధకారంలోకి వెళుతుందని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కరెంట్ కష్టాలు మొదలయ్యాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా డ్వాక్రా మహిళలు 43 లక్షల మంది ఉన్నారని.. వారి కోసం సముదాయ భవనాలు నిర్మిస్తామని పద్మా దేవేందర్ రెడ్డి హామీ ఇచ్చారు.
MLA Padma Devender Reddy on BRS :బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే సౌభాగ్య లక్ష్మి పథకం కింద పేద మహిళలకు ప్రతి నెల రూ.3 వేలు జీవన భృతి ఇస్తామని పద్మా దేవేందర్ రెడ్డి తెలిపారు. సిలిండర్, బంగారం,పెట్రోల్, డీజిల్ ధర తగ్గించాలని ప్రధానికి లేఖ రాస్తే వారు పట్టించుకోలేదని మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పింఛను రూ. 2000 ఇస్తోందని.. వాటిలో సిలిండర్‌కే రూ. 1100 ఖర్చవుతోందన్నారు.
"తెలంగాణ ఉద్యమ పోరాటం చేసి రాష్ట్రాని తెప్పించుకున్నాం. రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ఎన్నో అభివృద్ధి పథకాలు అమలు చేశారు. తెలంగాణ రాక ముందు అభివృద్ధి ఎలా ఉండేది , ఇప్పుడు ఎలా ఉందని గమనించాలి. 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏదైనా ఉందంటే అది కేవలం తెలంగాణ మాత్రమే. ఇన్ని గంటల కరెంటు ఇస్తున్నాము కావున రైతులు ఇన్ని పంటలు పండిస్తున్నారు. రైతుబంధు కేసీఆర్ ఇస్తున్నారు."- పద్మా దేవేందర్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి
సామాన్యులకు కేసీఆర్ అండ : సామాన్యులకు గ్యాస్‌బండ.. గుదిబండగా మారిందనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ మేనిఫెస్టో ప్రకటనలో రూ.400కే సిలిండర్ ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. గొల్ల కుర్మలకు గొర్ల పంపిణీ, ముదిరాజ్‌లకు ఉచితంగా చేప పిల్లల పంపిణీ, దళితులకు దళిత బంధు ఇస్తున్నామన్నారు. కులవృత్తులకు ఇచ్చే బీసీ బంధు.. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.
'తెలంగాణ అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యం' 'సనత్‌నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే'
యువతే టార్గెట్‌గా ప్రచారం ట్రెండ్ ఫాలో అవుతున్న బీఆర్‌ఎస్ నేతలు