రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలను సమాన దృష్టితో చూస్తోందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉన్నా... పేదలను దృష్టిలో ఉంచుకుని సంక్షేమ పథకాలలో ఏమాత్రం కోత విధించకుండా అమలు పరుస్తున్నామని తెలిపారు. మెదక్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నఎమ్మెల్యే 20 మంది క్రైస్తవులకు గిఫ్ట్ ప్యాకెట్లను పంపిణి చేశారు.
'ప్రభుత్వం అన్ని మతాలను సమాన దృష్టితో చూస్తోంది' - ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి తాజా పర్యటనలు
పేదలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సంక్షేమ పథకాలలో కోత విధించకుండా అమలు పరుస్తోందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. పేదలందరూ పండగలను సంతోషంగా జరుపుకోవాలనే ప్రభుత్వం బహుమతులను అందిస్తోందని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నఎమ్మెల్యే క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలను పంపిణి చేశారు.
Breaking News
ప్రతి పేదవాడు పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ప్రభుత్వం బహుమతులను అందిస్తోందని పద్మాదేవేందర్ రెడ్డి తెలిపారు. బతుకమ్మ చీరలు, రంజాన్ కానుకల మాదిరిగానే క్రైస్తవులకు క్రిస్మస్ బహుమతులను పంపిణీ చేస్తోందని పేర్కొన్నారు. నర్సాపూర్, మెదక్ నియోజకవర్గాలకు ఇప్పటికే రెండు వేల పాకెట్లు చేరాయని అన్నారు. అర్హులైన వారికి త్వరలోనే వాటిని పంపిణీ చేస్తామని తెలిపారు.
ఇదీ చదవండీ:వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై రేపు సీఎం సమీక్ష