మహిళలందరూ ఆర్థికంగా ఎదిగినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. నాబార్డు నిధులు రూ.5లక్షలతో మెదక్ పట్టణంలో నిర్మించిన మంజీరా రూరల్ మార్ట్‌ను సోమవారం ప్రారంభించారు. మహిళలు ఆర్థికంగా ఎదగడం కోసం ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోందని తెలిపారు. తల్లిదండ్రులు ఆడపిల్లలను చదివించాలని సూచించారు.
మహిళలు చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామన్నారు. చేతితో తయారు చేసిన వస్తువులను నాణ్యతతో అందించాలని సూచించారు. దీన్ని ఆదర్శంగా తీసుకొని త్వరలో గ్రామాల్లోనూ చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తామని తెలిపారు.