మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని రాయ రావు చెరువు కట్టపై పట్టణానికి చెందిన తెరాస నాయకుడు కుమ్మరి సురేశ్ నూతనంగా నిర్మించిన శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి ఆలయంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు.
ఎల్లమ్మ దేవి ఆలయంలో ఎమ్మెల్యే పూజలు - ఎమ్మెల్యే మదన్ రెడ్డి తాజా వార్తలు
మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి ఆలయంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గ ప్రజలపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. వర్షాలు సమృద్ధిగా పడాలని ఆకాంక్షించారు.
![ఎల్లమ్మ దేవి ఆలయంలో ఎమ్మెల్యే పూజలు ఎల్లమ్మ దేవి ఆలయంలో ఎమ్మెల్యే పూజలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7965021-683-7965021-1594354720000.jpg)
ఎల్లమ్మ దేవి ఆలయంలో ఎమ్మెల్యే పూజలు
ఎల్లమ్మ దేవి ఆశీస్సులు నర్సాపూర్ నియోజకవర్గంపై ఉండి వర్షాలు సమృద్ధిగా పడాలని మొక్కుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో గుడి నిర్మాణం చేపట్టిన సురేశ్‌ను మదన్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ మురళి యాదవ్, కౌన్సిలర్లు కుమ్మరి లక్ష్మీ నాగేశ్, అశోక్ గౌడ్ పాల్గొన్నారు.
ఇవీ చూడండి:కీలక నిర్ణయం: ఇంటర్ ద్వితీయంలో ఫెయిలైన వారంతా ఉత్తీర్ణులే..