మెదక్ జిల్లా పురపాలక సంఘంలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి సర్వసభ్య సమావేశం నిర్వహించి పలు విషయాలపై చర్చించారు. పట్టణాన్ని ఆదర్శంగా ఉండే విధంగా చూడాలని ఎమ్మెల్యే కోరారు. జిల్లాలో పచ్చదనం, పర్యావరణం, చెత్తసేకరణ తదితర వాటిపై మాట్లాడారు. కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండేలా చర్యలు తీసుకోవాలని.. ప్రజలందరికీ అవగాహన కల్పించాలని మదన్‌రెడ్డి అధికారులను సూచించారు.
కరోనాపై ప్రజల్లో ఇంకా చైతన్యం పెంచాలి: ఎమ్మెల్యే మదన్‌రెడ్డి - mla madanreddy opened super market at medak district
మెదక్ జిల్లా పురపాలక సంఘంలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలందరినీ చైతన్యపరచాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పట్టణంలోని శ్రీ సూపర్‌మార్కెట్, ఫార్మా డిస్ట్రిబ్యూటర్ను ఎమ్మెల్యే ప్రారంభించారు.
మెదక్‌లో సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్‌రెడ్డి
అనంతరం మాజీమంత్రి సునీతారెడ్డితో కలిసి పట్టణంలో శ్రీ సూపర్‌మార్కెట్, ఫార్మా డిస్ట్రిబ్యూటర్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అక్కడి ప్రాంత ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన సరుకులను అందించాలని.. అప్పుడే అన్ని వర్గాల ప్రజలకు మార్కెట్ ఉపయోగపడుతుందని మదన్‌రెడ్డి తెలిపారు. పట్టణంలో దొరకని వస్తువులను విక్రయించాలని ఎమ్మెల్యే సూచించారు.
ఇదీ చూడండి: సీనియర్ల లేఖపై రాహుల్ గాంధీ ఆగ్రహం