నర్సాపూర్ పురపాలిక పరిధిలోని దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూముల పూర్తి వివరాలు సేకరించాలని మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పురపాలిక కార్యాలయంలో అధికారులు, కౌన్సిలర్లతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు.
'దేవాదాయ భూముల పూర్తి వివరాలు సేకరించాలి' - తెలంగాణ వార్తలు
ధరణి పోర్టల్ ప్రారంభం అయ్యేలోపు నర్సాపూర్ పురపాలిక పరిధిలోని దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూముల వివరాలు సేకరించాలని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఆదేశించారు. వాటిలో నిర్మాణాలేమైనా ఉంటే వెంటనే నమోదు చేయాలని అన్నారు. నర్సాపూర్ పురపాలిక కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు.
'దేవాదాయ భూముల పూర్తి వివరాలు సేకరించాలి'
ఈ భూములలో నిర్మాణాలు ఏమైనా ఉంటే వెంటనే నమోదు చేయాలని అన్నారు. దసరా రోజున ధరణి పోర్టల్ ప్రారంభం కానున్నందున... అప్పటిలోగా పూర్తి వివరాలు సేకరించి, నమోదు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ మురళి యాదవ్, తహసీల్దార్ మాలతి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:అన్ని ఆస్పత్రుల్లో కొవిడేతర సేవలు ప్రారంభించండి: ఈటల