జాతర ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయలు అని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మాజీ మంత్రి సునీతారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం పెద్ద చింతకుంట గ్రామంలో దుర్గామాత జాతర ఉత్సవాలకు వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
దుర్గామాత జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్‌రెడ్డి - ఎమ్మెల్యే మదన్‌రెడ్డి తాజా వార్త
మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని దుర్గామాత జాతర ఉత్సవాల్లో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మాజీ మంత్రి సునీతారెడ్డి పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దుర్గామాత జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్‌రెడ్డి
ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. డప్పు చప్పుళ్ల నుడుమ యువకులు నృత్యాలు చేస్తూ బండ్లను ఉరేగించారు. ఏటా శివరాత్రి తెల్లవారి జాతరను నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ వస్తుందని సర్పంచి శివకుమార్ తెలిపారు.
ఇవీ చూడండి:పంట బీమా వల్ల.. రైతుకేది ధీమా..?