తెలంగాణ

telangana

ETV Bharat / state

మత్తడి దూకుతున్న రాయారావు చెరువు.. పూజలు చేసిన ఎమ్మెల్యే - MLA Madan Reddy

ఐదేళ్ల తర్వాత మెదక్​ జిల్లాలోని నర్సాపూర్​ రాయారావు చెరువు అలుగు పారుతున్నది. భారీ వర్షాలకు చెరువు నిండగా.. ఎమ్మెల్యే మదన్​ రెడ్డి చెరువుకు ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గంలో దాదాపు చెరువులన్ని నిండాయని.. రైతులు ఆనందంగా ఉన్నారని ఎమ్మెల్యే అన్నారు.

MLA Madan Reddy Conduct Special pooja At Rayarao Cheruvu
మత్తడి దూకుతున్నరాయారావు చెరువు.. ఎమ్మెల్యే పూజలు

By

Published : Oct 15, 2020, 10:34 AM IST

వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్రంలో చెరువులన్నీ నిండాయని.. వాగులు, వంకలు జోరుగా ప్రవహిస్తుండటం వల్ల రైతు కళ్లు ఆనందంతో నిండిపోయాయని నర్సాపూర్​ ఎమ్మెల్యే మదన్​ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్​ పట్టణ సమీపంలో మత్తడి దూకుతున్న రాయారావు చెరువును మున్సిపల్​ ఛైర్మన్​ మురళీ యాదవ్​తో కలిసి సందర్శించారు. చెరువుకు ప్రత్యేక పూజలు చేశారు.

వేసవి కాలంలో చుక్క నీరు కూడా లేకుండా ఎండిపోయిన రాయారావు చెరువు.. భారీ వర్షాలకు పూర్తిగా నిండి అలుగు దూకుతున్నది. వర్షాలతో.. చెరువులు, కుంటలు నిండాయని.. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీచూడండి:రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు... జనజీవనం అస్తవ్యస్థం

ABOUT THE AUTHOR

...view details