చెరువులలో పూడిక తీయడం వలన నీటి నిలువ సామర్థ్యం పెరుగుతుందని మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. నర్సాపూర్ పట్టణ సమీపంలోని రాయరావు చెరువులో పూడికతీత పనులను పరిశీలించారు. పెద్దచెరువులో వేసవికాలంలో నీరు లేకపోవడం వల్ల పనులు చేపట్టినట్లు కలెక్టర్ వెల్లడించారు. దాదాపు పదిహేను అడుగులకు పైగా మట్టి పేరుకుపోయిందని.. త్వరిత గతిన పనులు మొదలు పెట్టి గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
చెరువులో పూడికతీత పనులు పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్ - మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, కలెక్టర్ ధర్మారెడ్డి చెరువుల పరిశీలన
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణ సమీపంలోని రాయరావు చెరువులో పూడికతీత పనులను ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, కలెక్టర్ ధర్మారెడ్డి పరిశీలించారు. చెరువులలో పూడిక తీయడం వలన నీటి నిలువ సామర్థ్యం పెరుగుతుందని పేర్కొన్నారు. వర్షాలు కురిస్తే పనులు నిలిచిపోతాయని.. వేసవిలోనే పూర్తి చేయాలని సూచించారు.
చెరువులో పూడికతీత పనులు పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్
వర్షాకాలంలో చెరువులోకి నీటి నిలువ భారీగా పెరిగే అవకాశం ఉందని ఎమ్మెల్యే మదన్ రెడ్డి తెలిపారు. గ్రామాలలోని చెరువులు, కుంటలు పూడిక తీయడానికి ముందుకు వచ్చి.. గ్రామపంచాయతి తీర్మానం చేస్తే అనుమతులు వెంటనే ఇస్తామని తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన పూడిక తీత పనులపై ఆరా తీశారు. వర్షాలు కురిస్తే పూడికి పనులు నిలిచిపోతాయని.. వేసవిలోనే పూర్తి చేయాలని సూచించారు.