తెలంగాణ

telangana

ETV Bharat / state

Srinivas Goud: 'సర్దార్ సర్వాయి పాపన్న అడుగుజాడల్లో నడవాలి' - తెలంగాణ వార్తలు

రాష్ట్ర వ్యాప్తంగా సర్దార్ సర్వాయి పాపన్న(sardar sarvai papanna) జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్(srinivas goud) పాల్గొన్నారు. తెరాస(trs) ప్రభుత్వంలో కుల వృత్తులకు గౌరవం దక్కిందని అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న సేవలను స్మరించుకున్నారు.

Srinivas Goud in medak, sardar sarvai papanna birth anniversary
మంత్రి శ్రీనివాస్ గౌడ్, సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు

By

Published : Aug 18, 2021, 8:18 PM IST

సర్దార్ సర్వాయి పాపన్న(sardar sarvai papanna) లాంటి మహనీయుని అడుగుజాడల్లో నడవాలని రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాసగౌడ్(srinivas goud) అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న 371 జయంతి సందర్భంగా మెదక్ జిల్లా నర్సాపూర్‌ పట్టణంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేశారు. బహుజనుల కోసం ఎంతో కృషి చేసిన మహనీయుని విగ్రహాల ఏర్పాటుకు తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్మన్ సునితా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మెదక్‌లో విగ్రహావిష్కరణ

తెరాస ప్రభుత్వంలో కులవృత్తులకు గౌరవం దక్కిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మెదక్ పట్టణంలోని రేణుక ఎల్లమ్మ ప్రాంగణంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 371 జయంతి సందర్భంగా బుధవారం ఆయన విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డిలు పాల్గొన్నారు. పట్టణ సంఘం విన్నపం మేరకు గౌడ సంఘం కమ్యూనిటీ భవనాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

గోల్కొండ కోటను జయించి గొలుసుకట్టు చెరువులు నిర్మించిన గొప్ప యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న. సమైక్య రాష్ట్రంలో ఆయన చరిత్రను కనుమరుగు చేశారు. కానీ పోరాటయోధులకు సీఎం కేసీఆర్(cm kcr) ప్రముఖ స్థానం కల్పించారు. అన్ని కులాలకు సముచిత స్థానం కల్పించారు. రాష్ట్రంలో వెయ్యి గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుంది.

-మంత్రి శ్రీనివాస్ గౌడ్

అన్నం పెట్టిన ప్రాంతం మెదక్

గౌడ కులస్థులు, కల్లుగీత కార్మికుల గురించి ప్రత్యేక జీవో తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ కులానికే కాకుండా బహుజనులకు కూడా ఆయన నాయకుడు అని పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో ఇక్కడి నుంచి వెళ్లినప్పుడు అన్నం పెట్టిన ప్రాంతం మెదక్ అని గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఉద్యమ నాయకులకు సీఎం కేసీఆర్ సముచిత స్థానం కల్పించారని తెలిపారు.

సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్

మరో విగ్రహం

మెదక్ పట్టణంలోని ట్యాంక్ బండ్‌పై మరో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తెలిపారు. అనంతరం ఎల్లమ్మ గుడి ప్రాంగణంలో ఈత మొక్కలు నాటారు. ఇందిరా గాంధీ స్టేడియాన్ని పరిశీలించి ప్రారంభానికి సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ ఛైర్‌పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, మున్సిపల్ ఛైర్మన్ చంద్రపాల్ గౌడ కులస్థులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మంత్రి శ్రీనివాస్ గౌడ్, సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు

సినిమా ప్రారంభం

జమీందార్లు, దొరల అరాచకత్వంపై తిరుగుబాటు చేసి పీడిత వర్గాల కోసం పాటుపడిన సర్దార్ సర్వాయి పాపన్న జీవిత కథ ఆధారంగా కింగ్ ఆఫ్ గోల్కొండ తెరకెక్కనుంది. ఆర్కే ఫిల్మ్స్ పతాకంపై ప్రతాని రామకృష్ణగౌడ్ దర్శకత్వం వహించనున్న చిత్రాన్ని ఆయన జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌లో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై... కింగ్ ఆఫ్ గోల్కొండ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సినిమాని ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కించాలని దర్శక నిర్మాతలకు శ్రీనివాస్ గౌడ్ సూచించారు. వంశీ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు.

ఇదీ చదవండి:Child marriage: కాసేపట్లో పెళ్లి... అధికారుల ఎంట్రీతో ఆగిపోయింది..

ABOUT THE AUTHOR

...view details