తెలంగాణ

telangana

ETV Bharat / state

నర్సాపూర్​​ను ఆదర్శవంతంగా చేస్తాం: హరీశ్‌ - మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో రూ.15 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ను ఆదర్శంగా ఉండే విధంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. నర్సాపూర్‌లో రూ.15 కోట్ల అభివృద్ది పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి హరీశ్‌

By

Published : Nov 7, 2019, 9:49 AM IST

మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో రూ.15 కోట్ల అభివృద్ధి పనులకు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన వీధిదీపాలను ప్రారంభించారు. ఎమ్మెల్యే మదన్‌రెడ్డి సిద్దిపేటలో కోమటి చెరువులాగా, నర్సాపూర్‌ రాయరావు చెరువును సుందరీకరించాలని సూచించారు.

దీంతో పాటు కూరగాయల మార్కెట్‌, మిని స్టేడియం, రోడ్లకు ప్రత్యేక నిధులు మంజూరు చేయిస్తామన్నారు. మొన్నటి వరకు నర్సాపూర్‌ ఊరు, ఇప్పుడు పట్టణం మున్సిపాలిటీ చేసుకున్నామన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో తెరాస జెండా ఎగరేస్తామని తెలిపారు.

ఇంకా ఎంతో అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. కాళేశ్వరం కాలువ పనులు పూర్తయితే లక్ష ఎకరాలకు సాగునీరు, తాగునీరు ఇస్తామన్నారు. గాయకుడు సాయిచంద్‌ తన ఆటపాటలతో సభకు వచ్చిన వారిని ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాజీమంత్రి సునీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి హరీశ్‌

ఇదీ చూడండి : గొడ్డలితో నరికి యువకుడి దారుణ హత్య

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details