మెదక్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో 38 లక్షల జాతీయ ఆరోగ్య మిషన్ నిధులతో రోగ నిర్ధరణ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు.
రోగ నిర్ధరణ పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించిన హరీశ్ రావు - మెదక్ జిల్లా వార్తలు
మెదక్లో రోగ నిర్ధరణ పరీక్ష కేంద్రాన్ని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ కేంద్రం 38 లక్షల జాతీయ ఆరోగ్య మిషన్ నిధులతో ఏర్పాటు చేశారు.
రోగ నిర్ధరణ పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించిన హరీశ్ రావు
అలాగే నూతన కలెక్టరేట్ ఆవరణలో ఒక కోటి 5 లక్షలతో ఈవీఎం, వీవీ ప్యాట్లను నిల్వ ఉంచే భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, కలెక్టర్ ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:సమ్మక్క, సారలమ్మ సన్నిధిలో కేసీఆర్... పట్టు వస్త్రాల సమర్పణ