తెలంగాణ

telangana

ETV Bharat / state

నర్సాపూర్​లో మంత్రి హరీశ్ రావు ఆకస్మిక పర్యటన - నర్సాపూర్​లో మంత్రి హరీశ్ రావు పర్యటన

పట్టణ ప్రగతిలో భాగంగా మంత్రి హరీశ్ రావు నర్సాపూర్​లో ఆకస్మికంగా పర్యటించారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో తిరిగి పరిశీలించారు.

MINISTER HARISH RAO IN NARSAPUR
నర్సాపూర్​లో మంత్రి హరీశ్ రావు ఆకస్మిక పర్యటన

By

Published : Mar 1, 2020, 2:25 PM IST

మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణ ప్రగతిలో భాగంగా మంత్రి హరీష్ రావు ఆకస్మికంగా పర్యటించారు. బస్టాండ్ ఆవరణలో ఉన్న ఆర్టీసీ నీటి కుంటను పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న పాఠశాల, తహసీల్దార్ కార్యాలయ పనులను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీటి నిర్మాణాల కోసం మరిన్ని నిధులు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

కూరగాయలు, మటన్, చేపల మార్కెట్ ఓకే దగ్గర ఉండేలా నిర్మాణం చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. అలా అయితే పట్టణ ప్రజలకు అన్నీ ఒకే చోటు దొరుకుతాయని తెలిపారు.

నర్సాపూర్​లో మంత్రి హరీశ్ రావు ఆకస్మిక పర్యటన

ఇవీ చూడండి:పట్టణ ప్రగతి అపశ్రుతి.. ఐదేళ్ల పాప మృతి

ABOUT THE AUTHOR

...view details