తెలంగాణ

telangana

ETV Bharat / state

'కరోనా విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దు.. ధైర్యంగా ఉండండి' - మెదక్ జిల్లా ఏరియా ఆస్పత్రి

మెదక్ జిల్లా ఏరియా ఆస్పత్రిని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డితో కలిసి మంత్రి హరీశ్​రావు సందర్శించారు. కొవిడ్​ బాధితులతో మాట్లాడి వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. మరోవైపు... వర్షాకాలం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో... ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.

minister harish rao visited medak district hospital
minister harish rao visited medak district hospital

By

Published : May 20, 2021, 4:35 PM IST

కరోనా విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని... ముఖ్యమంత్రే స్వయంగా గాంధీ ఆస్పత్రికి వెళ్లి రోగుల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారని మంత్రి హరీశ్​రావు తెలిపారు. మెదక్ జిల్లా ఏరియా ఆస్పత్రిని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డితో కలిసి మంత్రి సందర్శించారు. కొవిడ్ బాధితులను పరామర్శించారు. వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రలలో ఎక్కడా రెమ్​డెసివిర్, మందులు, ఆక్సిజన్ కొరత లేదని మంత్రి హరీశ్​ రావు స్పష్టం చేశారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో రెండు మూడు రోజులకు సరిపడా ఆక్సిజన్ నిలువఉందని... ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రైవేటు ఆసుపత్రులలో కూడా కలెక్టర్ మానిటర్ చేస్తూ... రెమ్​డెసివిర్, ఆక్సిజన్ కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చాలా వరకు బెడ్లు ఖాళీగానే ఉంటున్నాయని.. అందరూ ప్రైవేట్​ ఆస్పత్రులకే పరుగులు పెట్టి జేబులు ఖాళీ చేసుకుంటున్నారన్నారు.

చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో పంట పండుతుందన్న మంత్రి... జిల్లాలో ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేసినట్టు తెలిపారు. వర్షాకాలం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో... ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. లారీల సమస్య ఉంటే ట్రాక్టర్లను వాడుకోవాలని... హామాలీల సమస్య ఉంటే స్థానికంగా ఉండే హమాలీలను వాడుకోవాలని సూచించారు. గోదాములు సరిపోకపోతే ప్రభుత్వ పాఠశాలలో గానీ... రైతు వేదికలో గానీ... అవసరమైతే ఫంక్షన్​హాల్​లో కూడా ధాన్యాన్ని నిలువచేయాలని మంత్రి తెలిపారు.

ఇదీ చూడండి: 'ఒంటరిగా ఉంచండి.. ఒంటరి వాళ్లని చేయకండి'

ABOUT THE AUTHOR

...view details