ఎప్పుడు అవకాశం వచ్చినా.. విద్యార్థులతో మమేకం అయ్యే మంత్రి హరీశ్‌రావు.. మెదక్ జిల్లాలో ఉపాధ్యాయుడిగా మారారు. మెదక్ పర్యటనలో ఉన్న మంత్రి.. పాపన్నపేట మండలం కొత్తపల్లిలోని జిల్లా పరిషత్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరోనా అనంతరం చదువు ఎలా సాగుతోంది, మధ్నాహ్న భోజనం, పెద్దయ్యాక ఏం అవుతారు, జీవిత లక్ష్యాలు వంటి విషయాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
సరదాగా కాసేపు: విద్యార్థుల ప్రావీణ్యాన్ని పరీక్షించిన మంత్రి హరీశ్ - medak district latest news
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కొత్తపల్లిలోని జిల్లా పరిషత్ పాఠశాలను మంత్రి హరీశ్‌రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాసేపు ఉపాధ్యాయుడిగా మారి.. విద్యార్థుల ప్రావీణ్యాన్ని పరీక్షించారు. తెలుగు నుడికారాలు, జాతీయాలు, సామెతలు, సొంత వాక్యాలపై ప్రశ్నించారు. కరోనా అనంతరం చదువులపై ఆరా తీశారు. పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.

సరదాగా కాసేపు: విద్యార్థుల ప్రావీణ్యాన్ని పరీక్షించిన మంత్రి హరీశ్
సరదాగా కాసేపు: విద్యార్థుల ప్రావీణ్యాన్ని పరీక్షించిన మంత్రి హరీశ్
అనంతరం తెలుగు, గణితంలో విద్యార్థుల ప్రావీణ్యాన్ని మంత్రి పరీక్షించారు. తెలుగు నుడికారాలు, జాతీయాలు, సామెతలు, సొంత వాక్యాలపై ప్రశ్నించారు. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.
Last Updated : Feb 24, 2021, 8:57 PM IST