తెలంగాణ

telangana

ETV Bharat / state

Harishrao: 'పనుల్లో వేగం పెంచి ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయండి' - minister harish rao visit news

మంత్రి హరీశ్​రావు జిల్లా కేంద్రంలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించటంతో పాటు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచి ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

minister harish rao visit in medak
minister harish rao visit in medak

By

Published : Jun 24, 2021, 7:24 PM IST



పనుల్లో వేగం పెంచి వచ్చే నవంబర్​లోపు మెదక్​ సమీకృత కలెక్టరేట్​ భవనం పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని మంత్రి హరీశ్​ రావు అధికారులను ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ బిల్డింగ్​లో ఆర్ అండ్ బీ, పోలీస్ ఇంజినీరింగ్ విభాగం అధికారులతో మంత్రి సమీక్షాసమావేశం నిర్వహించారు. నవంబర్ నాటికి ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ బిల్డింగ్​ను పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు కూలీల సంఖ్య పెంచుకోవాలన్నారు.

"ఇక నుంచి వారానికోసారి నిర్మాణ పనులను కలెక్టర్​ పర్యవేక్షించాలి. అసంపూర్తిగా ఉన్న జిల్లా పోలీసు కార్యాలయ నిర్మాణ పనులు పునఃప్రారంభానికి పోలీస్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు తగు చర్యలు తీసుకోవాలి. జిల్లా ఎస్పీ కార్యాలయం నిర్మాణ పనులు నెమ్మదిగా జరుగుతున్నాయన్న కారణంతో.. ఇదివరకు ఉన్న కాంట్రాక్టర్​ను తీసేసి మళ్లీ షార్ట్ టెండర్ పిలవాలని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ సూచించిచారు. ఆ షార్ట్ టెండర్ నిర్వహించి ఏడెనిమిది నెలల్లో జిల్లా పోలీస్ కార్యాలయం నిర్మాణం కూడా పూర్తి చేయాలి." -హరీశ్​రావు, మంత్రి

అంతకుముందు.. పీఎన్​ఆర్ ఇండోర్ స్టేడియంలో కొత్తగా ఏర్పాటు చేసిన సింథటిక్ బ్యాడ్మింటన్ కోర్టును మంత్రి హరీశ్​రావు ప్రారంభించారు. స్టేడియం ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఎమ్మెల్సీ శేరి సుభాష్​రెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్​ రెడ్డితో కలిసి కాసేపు బ్యాడ్నింటన్ ఆడారు. అనంతరం... నాలుగున్నర కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్​ను, 2 కోట్లతో నిర్మించనున్న వైకుంఠధామానికి శంకుస్థాపన చేశారు. మెదక్​లో 1,000 ఇళ్లు, నర్సాపూర్​లో 800, తూప్రాన్​లో 800, రామయంపేటలో 300 డబుల్​ బెడ్ రూం ఇళ్ల ప్రారంభానికి సిద్ధం చేయాలని కలెక్టర్ హరీశ్​కు సూచించారు.

జిల్లాలో కరోనా పూర్తిస్థాయిలో తగ్గిందని మంత్రి తెలిపారు. ప్రజలందరూ భౌతిక దూరం పాటిస్తూ మాస్కు ధరించాలని హరీశ్​రావు సూచించారు.


ఇదీ చూడండి: kaleshwaram: కాళేశ్వరం నుంచి నిర్విరామంగా కొనసాగుతున్న నీటి ఎత్తిపోతలు

ABOUT THE AUTHOR

...view details