తెలంగాణ

telangana

By

Published : Jan 9, 2021, 4:17 PM IST

ETV Bharat / state

ఏప్రిల్​ నుంచి పూర్తి స్థాయిలో రుణమాఫీ : హరీశ్​రావు

రైతుల సంక్షేమం కోసం తెరాస ప్రభుత్వం మూడో వంతు బడ్జెట్ ఖర్చు చేస్తోందని మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. అన్నదాతలను సంఘటితం చేసేందుకే రైతు వేదికలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామని వెల్లడించారు.

minister harish rao toured in medak district
ఏప్రిల్​ నుంచి పూర్తిస్థాయిలో రుణమాఫీ: మంత్రి హరీశ్​రావు

రైతులను సంఘటితం చేసేందుకే తెరాస ప్రభుత్వం రైతువేదికల నిర్మాణాలకు శ్రీకారం చుట్టిందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలో రైతువేదికలు, రెండు పడక గదుల ఇళ్లను ఎమ్మెల్యే పద్మా దేవేందర్ ​రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మండలంలోని పలువురు ఎంపీటీసీలు,సర్పంచ్‌లు మంత్రి సమక్షంలో తెరాసలో చేరారు.

రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం మూడో వంతు బడ్జెట్ ఖర్చు చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. కరోనా కారణంగా రుణమాఫీ కాస్త ఆలస్యం అయ్యిందని.. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో రుణాలు మాఫీ చేస్తామన్నారు. ఈ సందర్భంగా రైతులకు పామాయిల్ తోటలు, పట్టు తోటలు పెంచే విధంగా సబ్సిడీలు అందిస్తున్నామని తెలిపారు.

గత పాలకులు రాష్ట్ర ప్రజలకు కనీసం తాగునీరు అందివ్వలేదని.. తెరాస హయాంలో తాగు,సాగు నీరందిస్తున్నామని మంత్రి అన్నారు. త్వరలోనే శంకరంపేటకు కాళేశ్వరం జలాలు తీసుకువస్తామని, రెండు పంటలు పండుతాయని వెల్లడించారు.

ఇదీ చూడండి: మొదటి కరోనా వ్యాక్సిన్ నేనే తీసుకుంటా: మంత్రి ఈటల

ABOUT THE AUTHOR

...view details