తెలంగాణ

telangana

ETV Bharat / state

భవిష్యత్తు తరాలను పచ్చగా చేసేందుకే అడవుల పునరుద్ధరణ: హరీశ్​రావు - ఆరో విడత హరితహారం

మెదక్​ జిల్లాలో ఆరో విడత హరితహారం కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ సూచన మేరకు అడవుల పునరుద్ధరణను విజయవంతం చేస్తామని మంత్రి వెల్లడించారు. అడవుల ప్రాముఖ్యత అందరికీ తెలిసేలా చేసిన గొప్పవ్యక్తి కేసీఆర్​ అని కొనియాడారు.

minister-harish-rao-talk-about-haritha-haram-in-narsapur-medak-ditrict
'రాబోయే తరాలకు అడవులను అందించడమే మా లక్ష్యం'

By

Published : Jun 25, 2020, 3:14 PM IST

మెదక్​ జిల్లాలో మొత్తం 58 వేల హెక్టార్లో అడవులు ఉన్నాయని మంత్రి హరీశ్ రావు తెలిపారు. హరితహారంలో భాగంగా ఈ ఏడాది 12 వేల హెక్టార్లలో అడవిని అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మెదక్​ జిల్లాలోని ఆరో విడత హరితహారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్​తో కలిసి ఆయన పాల్గొన్నారు.

రాబోయే తరాల కోసమే అడవుల పునరుద్ధరణను ముఖ్యమంత్రి చేపట్టారు. అడవుల ప్రాముఖ్యత అందరికీ తెలిసేలా చేసిన ఘనత ఆయనది. సీఎం సూచనల మేరకు అడవుల పునరుద్ధరణను విజయవంతం చేస్తాం. మెదక్ జిల్లాలో 58వేల హెక్టార్లో అడవులు ఉన్నాయి. ఈ ఏడాది 12 వేల హెక్టార్లలో అడవిని అభివృద్ధి చేస్తాం. 469 పంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటు చేసి... మొక్కలు పెంచాం.

-మంత్రి హరీశ్ రావు

'రాబోయే తరాలకు అడవులను అందించడమే మా లక్ష్యం'

మెదక్ జిల్లాలో రెండు నెలల్లో రైతు వేదికలు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. జిల్లాలోని 2.60 లక్షల ఎకరాల్లో నియంత్రిత విధానంలో సాగు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇవీ చూడండి:సమష్టికృషితో నర్సాపూర్‌ అటవీప్రాంతానికి పునర్జీవం: సీఎం

ABOUT THE AUTHOR

...view details