తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆరేళ్లలో రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశాం' - telangana varthalu

దేశవ్యాప్తంగా రైతుల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నా.. రాష్ట్రంలో వారి సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్​రావు తెలిపారు. 70 ఏళ్లలో జరగని అభివృద్ధిని చేసి చూపించామన్నారు.

'ఆరేళ్లలో రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశాం'
'ఆరేళ్లలో రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశాం'

By

Published : Feb 4, 2021, 7:16 PM IST

ఆరేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేశామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. 70 ఏళ్లలో జరగని అభివృద్ధి చేసి చూపించామని అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేటలో... వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన ఛైర్మన్‌, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రితో పాటు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి , ఇతర నాయకులు హజరయ్యారు. దేశవ్యాప్తంగా రైతుల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నా.. రాష్ట్రంలో వారి సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టామని మంత్రి హరీష్​ వెల్లడించారు.

రైతులకు మేలు జరిగేలా నూతన కమిటీ పనిచేయాలని ఎమ్మెల్యే పద్మా దేవేందర్​ రెడ్డి సూచించారు. కరోనా వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గి చేయాలనుకున్న కొన్ని కార్యక్రమాలు చేయలేకపోయామని... అయినా అభివృద్ధి కార్యక్రమాలు ఆపలేదన్నారు. అతి త్వరలో కాళేశ్వరం నీళ్లను ఈ ప్రాంతానికి తీసుకొస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: 'న్యాయ సూత్రాలకు విరుద్ధంగా రెవెన్యూ ట్రైబ్యునళ్లు'

ABOUT THE AUTHOR

...view details