Minister Harish Rao Speech at Medak Public Meeting :బీఆర్‌ఎస్ పార్టీలో ఉండి ఎమ్మెల్సీగా ఎన్నికైతే తప్పా.. బీఆర్‌ఎస్ ఏమైనా నిషేధిత పార్టీనా అంటూ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు(Harishrao Fires on BJP) అన్నారు. బీజేపీ గవర్నర్ల(All State Governors)ను అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తుందని.. వారికి ఎలాగైనా తగిన గుణపాఠం చెప్పాలని మంత్రి తెలిపారు. మెదక్ జిల్లాలో నిర్వహించిన బీఆర్‌ఎస్ బహిరంగ సభ(BRS Public Meeting in Medak)లో మంత్రి హరీశ్‌రావు ప్రసంగించారు. అంతకు ముందు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఏకలవ్య విగ్రహాన్ని మంత్రి సత్యవతి రాఠోడ్‌తో కలిసి ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఎరుకల సాధికారత పథకాన్ని ప్రారంభించారు.
మూడు పద్ధతుల్లో ఎరుకల కులాలకు సహాయం చేస్తామని మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. ప్రాథమికంగా ప్రభుత్వ భూములు ఇచ్చి.. ఆర్థిక సాయం అందించి సొసైటీలుగా అవకాశం కల్పిస్తామని తెలిపారు. వారు పెంచిన పందులను హైదరాబాద్ తరలించడానికి వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. మెదక్ నుంచే ఇతర ప్రాంతాలకు ఎక్స్‌పోర్టు సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కుల అభివృద్ధికి మరింత ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు.
Minister Harish Rao Comments on Governor Tamilisai :ఎరుకుల జాతికి చెందిన వ్యక్తికి నామినేటెడ్ ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే గవర్నర్ దానిని తిరస్కరించారని గుర్తు చేశారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం గవర్నర్‌లను అడ్డు పెట్టుకుని నీచ రాజకీయాలు చేస్తోందన్నారు. ఎరుకల జాతికి ఎమ్మెల్సీ వస్తే.. వారంతా బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉంటుందేమోననే గవర్నర్‌కి అనుమానమని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. అందుకే విశ్వబ్రాహ్మణులు, ఎరుకల కులాల వాళ్లు ఒకే జట్టుగా బీజేపీకి సరైన గుణపాఠం చెప్పాలని కోరారు. ఈ గవర్నర్లను అడ్డుపెట్టుకొని బీజేపీ శకుని రాజకీయం చేస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.