మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో పలు అభివృద్ది కార్యక్రమాలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. వైకుంఠధామం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణాలకు భూమిపూజ చేశారు. రూ.11కోట్లతో భవనాలను పూర్తి చేస్తామని అన్నారు. నిర్మాణంలో ఉన్న గ్రంథాలయ భవనాన్ని పరిశీలించారు. అనంతరం మొక్కలు నాటి... ఆర్డీవో కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.
ప్రత్యేక నిధులు
నర్సాపూర్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ ఇటీవల రూ.500 కోట్లు నిధులు మంజూరు చేశారని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు నిర్మిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మహిళా కమిషన్ ఛైర్మన్ సునీతా రెడ్డి, జిల్లా కలెక్టర్ హరీశ్, లేబర్ వెల్ఫేర్ ఛైర్మన్ దేవేందర్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ మురళి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
సమీకృత మార్కెట్‌కు భూమిపూజ
మెదక్ జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని, నవంబరులో ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. గురువారం ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో ఔరంగబాద్ శివారులోని నూతన కలెక్టరేట్ వద్ద రూ.4.50 కోట్లతో నిర్మించనున్న సమీకృత మార్కెట్, రూ.2 కోట్లతో నిర్మించనున్న వైకుంఠధామం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.