తెలంగాణ

telangana

ETV Bharat / state

'రైతు వేదికల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలి' - మంత్రి హరీశ్ రావు రివ్యూ సమావేశం

మెదక్ జిల్లాలో ప్రభుత్వం నిర్మించే రైతు వేదికల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో వైద్యారోగ్య, విద్యుత్, వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

'రైతు వేదికల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలి'
'రైతు వేదికల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలి'

By

Published : Aug 11, 2020, 10:13 PM IST

మెదక్ జిల్లాలో ప్రభుత్వం నిర్మించే రైతు వేదికల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో వైద్యారోగ్య, విద్యుత్, వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ముందు ఇటీవల మృతి చెందిన దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డికి సంతాపసూచకంగా మౌనం పాటించారు.

76 రైతు వేదికలు..

మెదక్ జిల్లా వ్యాప్తంగా 76 రైతు వేదికలను నిర్మించాల్సి ఉందని మంత్రి అన్నారు. ఈ విషయంలో ఇప్పటి వరకు చాలా వరకు రైతువేదికల నిర్మాణాలు ఆయా దశల్లో ఉన్నాయన్నారు. కొన్ని చోట్ల స్థల సేకరణ జరిగిందని జిల్లా వ్యవసాయాధికారి పరశురామ్ నాయక్ మంత్రికి వివరించారు. రైతుబంధు పథకం కింద డబ్బులు రాని రైతుల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేయాలని మంత్రి ఆదేశించారు. జిల్లాకు సరఫరా కావాల్సిన ఎరువులు వచ్చాయా అనే వివరాలను మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

స్పెషల్ ఇన్సెంటివ్..

కరోనా విజృంభిస్తున్న సమయంలో ఆశ వర్కర్లకు కొవిడ్ స్పెషల్ ఇన్సెంటివ్ అందచేయాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎన్ని ర్యాపిడ్ కిట్స్ వచ్చాయనే అంశంపై ఆరా తీశారు. జిల్లాలోని ప్రతి పీహెచ్ సీలో కొవిడ్ పరీక్షలు విధిగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంఛార్జి కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, అడిషనల్ కలెక్టర్లు నగేశ్, వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, క్రాంతి కిరణ్, డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వర్ రావు, ట్రాన్స్ కో ఎస్ఈ శ్రీనాథ్, డీఏవో పరశురాం నాయక్, పీఆర్ఈఈ వెంకటేశ్వర్లు, డీఆర్డీఓ శ్రీనివాస్, జడ్పీ వైస్ ఛైర్ పర్సన్ లావణ్యరెడ్డి, ఆర్డీఓలు శ్యామ్ ప్రకాశ్, అరుణ, ఆయా శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details