తెలంగాణ

telangana

ETV Bharat / state

Minister Harish Rao Reaction on Congress 6 Guarantees : కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలు కాదు.. ఆర్నెళ్లకో సీఎం వస్తారు: మంత్రి హరీశ్​రావు - కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలపై హరీశ్​రావు కౌంటర్‌

Minister Harish Rao Reaction on Congress 6 Guarantees : గద్దెనెక్కే వరకు కాంగ్రెస్‌ నేతలు ఎలాంటి అబద్ధాలైనా మాట్లాడతారని మంత్రి హరీశ్​రావు అన్నారు. మెదక్ జిల్లా శంకరంపేటలో పర్యటించిన మంత్రి.. డబుల్ బెడ్​ రూమ్ ఇళ్లను ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభకు హాజరై.. కాంగ్రెస్​పై విరుచుకుపడ్డారు. కర్ణాటకలో చేయలేని వారు.. తెలంగాణలో మాయమాటలు చెబుతున్నారని విమర్శలు గుప్పించారు.

Minister Harish Rao Fires on Congress
Minister Harish Rao

By ETV Bharat Telangana Team

Published : Sep 19, 2023, 1:52 PM IST

Updated : Sep 19, 2023, 2:19 PM IST

Minister Harish Rao Reaction on Congress 6 Guarantees కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలు కాదు ఆర్నెళ్లకో సీఎం వస్తారు మంత్రి హరీశ్​రావు

Minister Harish Rao Reaction on Congress 6 Guarantees :కాంగ్రెస్‌ నాయకుల బోగస్‌ మాటలు నమ్మి ప్రజలు ఆగం కావొద్దని మంత్రి హరీశ్‌రావు(Finance Minister Harish Rao) అన్నారు. మెదక్​ జిల్లా శంకరంపేటలో పర్యటించిన ఆర్థికశాఖ మంత్రి.. గ్రామ శివారులో నిర్మించిన 100 రెండు పడక గదుల ఇళ్ల(Double Bedroom Houses)ను ప్రారంభించారు. తర్వాత శంకరంపేటలో ఏర్పాటు చేసిన సభకు మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్​పై విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధికి.. కాంగ్రెస్‌ చెబుతున్న అబద్దాలకు పోటీ జరగబోతుందని పేర్కొన్నారు.

Harish Rao Fires on Congress 6 Guarantees :గద్దెనెక్కే వరకు కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఎలాంటి అబద్ధాలైనా మాట్లాడతారని హరీశ్​రావు ధ్వజమెత్తారు. కర్ణాటకలో కరెంటు ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉందని ఆరోపించారు. కర్ణాటకలో చేయలేని వారు.. తెలంగాణలో మాయమాటలు చెబుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ వస్తే ఆరు గ్యారెంటీలు(Telangana Congress 6 Guarantees) కాదు.. ఆర్నెళ్లకో సీఎం వస్తారని ఎద్దేవా చేశారు. అలాగే ఆ పార్టీ అధికారంలోకి వస్తే.. ఆర్నెళ్లకో కర్ఫ్యూ హైదరాబాద్‌లో వస్తుందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ది తన్నుల సంసృతి అయితే.. బీఆర్​ఎస్​ది టన్నుల సంసృతి అని అన్నారు.

Harish Rao Counter to Congress Guarantees : 'కాంగ్రెస్‌ హామీలు గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అన్నట్లుంది'

'గద్దెనెక్కే వరకు కాంగ్రెస్‌ నేతలు ఎలాంటి అబద్ధాలైనా మాట్లాడతారు. కర్ణాటకలో కరెంటు ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉంది. కర్ణాటకలో చేయలేని వారు తెలంగాణలో మాయమాటలు చెబుతున్నారు. కాంగ్రెస్‌ వస్తే ఆరు గ్యారెంటీలు కాదు.. ఆర్నెళ్లకో సీఎం వస్తారు. కాంగ్రెస్ వస్తే ఆర్నెళ్లకో కర్ఫ్యూ హైదరాబాద్‌లో వస్తుంది. కాంగ్రెస్‌ నాయకుల బోగస్‌ మాటలు నమ్మి ఆగం కావొద్దు. పని చేసిన కేసీఆర్‌ను మరోసారి ఆశీర్వదిద్దాం. త్వరలో వచ్చే బీఆర్ఎస్ మేనిఫెస్టో ఇంకా అద్భుతంగా ఉంటుంది.' -హరీశ్​రావు, ఆర్థికశాఖ మంత్రి

Harish Rao Counter on Congress Six Guarantees : ప్రస్తుతం కేసీఆర్ సర్కార్ 24 గంటల కరెంటును ఇస్తుందని.. అదే రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే.. కరెంట్ ఆరు గంటలే వస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ నేతలు(Telangana Congress Leaders) తెలంగాణకు బెంగళూరును రెండో రాజధాని చేస్తారని పేర్కొన్నారు. ఆ పార్టీ నేతలు పని చేసే రకం కాదని.. మాటలతో మోసం చేసే రకమని మండిపడ్డారు. అలాగే పనిచేసిన కేసీఆర్‌ను మరోసారి ఆశీర్వదించాలని మంత్రి కోరారు. త్వరలో వచ్చే బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో(BRS Party Manifesto) ఇంకా అద్భుతంగా ఉంటుందని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చేదే చెబుతారని.. చెప్పింది చేసి చూపిస్తారని మంత్రి తెలిపారు.

KTR Fires on Congress 6 Guarantees : 'స్కాముల కాంగ్రెస్‌కు స్వాగతం చెబితే.. స్కీములన్నీ ఎత్తేస్తారు'

Harish Rao Fires on Congress : 'బీఆర్​ఎస్ చేసిన అభివృద్ధికి.. కాంగ్రెస్‌ చెబుతున్న అబద్దాలకు పోటీ'

Last Updated : Sep 19, 2023, 2:19 PM IST

ABOUT THE AUTHOR

...view details