70 ఏళ్లుగా తెలంగాణలో ఇతర పార్టీలు చేయలేని అభివృద్ధి ఏడేళ్లలో సీఎం కేసీఆర్ చేసి చూపించారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. మెదక్ జిల్లాలో నూతనంగా ఏర్పడిన మాసాయిపేట మండలంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు కలెక్టర్ హరీశ్, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, మహిళా కమిషన్ ఛైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, జడ్పీ అధ్యక్షురాలు హేమలత, ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి పాల్గొన్నారు.
ఏడేళ్లలో 70 ఏళ్ల అభివృద్ధి జరిగింది: హరీశ్‌రావు
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ 103 కొత్త మండలాలను ఏర్పాటు చేసినట్లు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఏడేళ్లలో 70 ఏళ్ల అభివృద్ధి సీఎం కేసీఆర్ చేశారని కొనియాడారు.
మంత్రి హరీశ్‌రావు
రాష్ట్రంలో 541 మండలంగా మాసాయిపేట మండలం ఏర్పాటు చేసినట్లు వివరించారు. 103 కొత్త మండలాలు ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని హరీశ్ అన్నారు. ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా తాగునీరు, 24 గంటల విద్యుత్ అందించామని, నర్సరీలు, శ్మశాన వాటికలు, డంప్ యార్డుల నిర్మాణాలతో తెలంగాణ పల్లెలు పరిశుభ్ర గ్రామాలుగా ఏర్పడ్డాయన్నారు. 70 ఏళ్లుగా చేయని ప్రగతి ఏడేళ్లలో చేసి చూపించామని మంత్రి హరీశ్ అన్నారు.
ఇదీ చదవండి :రాష్ట్రంలో లాక్డౌన్, కర్ఫ్యూకి ఆస్కారం లేదు: ఈటల