ఈ నెల చివరికి రైతుల ఖాతాల్లో రూ. 7200 కోట్లు జమ చేస్తామని ఆర్థిక మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మార్కెట్ కమిటీ పాలక వర్గం ప్రమాణ స్వీకారంలో మంత్రి హరీశ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాళేశ్వరం నీళ్లతో నర్సాపూర్ రైతుల కాళ్లు కడుగుతామని స్పష్టం చేశారు.
'ఈనెల చివరికల్లా రైతుల ఖాతాల్లోకి రూ. 7200 కోట్లు' - 'ఈనెల చివరికల్లా రైతుల ఖాతాల్లోకి రూ. 7200 కోట్లు'
మెదక్ జిల్లా నర్సాపూర్ మార్కెట్ కమిటీ పాలక వర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాళేశ్వరం నీళ్లతో నర్సాపూర్ రైతుల కాళ్లు కడుగుతామని స్పష్టం చేశారు.
!['ఈనెల చివరికల్లా రైతుల ఖాతాల్లోకి రూ. 7200 కోట్లు' minister harish rao participated in narsapur market committee oathing ceremony](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9847147-18-9847147-1607700975695.jpg)
minister harish rao participated in narsapur market committee oathing ceremony
రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని.. భాజపా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లేని విధంగా వరి, మొక్కజోన్న, కందులకు మద్దతు ధర చెల్లిస్తున్నామన్నారు. గత ప్రభుత్వాల హయాంలో మంజీర నదిపై ఒక్క చెక్ డ్యామ్ నిర్మించకున్నా.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.110 కోట్లతో 15 చెక్ డ్యాములు నిర్మించామని తెలిపారు.
ఇదీ చూడండి:జీహెచ్‌ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికపై స్పష్టత
Last Updated : Dec 11, 2020, 10:40 PM IST