ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని అసెంబ్లీలో తెలంగాణ పదం నిషేధించిన సమయంలోనే.. తెరాస పుట్టిందన్నారు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలంలో తెరాస ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను మంత్రి ఆవిష్కరించారు. త్యాగాల కోసం పుట్టిన పార్టీ తెరాస అని కొనియాడారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పదవులను తృణప్రాయంగా వదిలేసినట్లు గుర్తు చేసుకున్నారు. ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ... ప్రస్తుతం బంగారు తెలంగాణ వైపు ప్రయాణిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను.. కేంద్రం ఆదర్శంగా తీసుకుంటోందన్నారు.
తెరాస.. అప్పుడే పుట్టింది: హరీశ్‌రావు - Minister harish rao latest updates
మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలంలో తెరాస ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఆవిష్కరించారు.

తెరాస.. అప్పుడే పుట్టింది: హరీశ్‌రావు