తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణలో నీలివిప్లవం రాబోతుంది: మంత్రి హరీశ్ రావు

రాష్ట్ర ఆర్థికాభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. 80 కోట్ల చేప పిల్లల పంపిణీ చేపట్టామని... త్వరలోనే రాష్ట్రంలో నీలివిప్లవం రాబోతుందని ఆయన పేర్కొన్నారు. మత్స్యకారులే మార్కెటింగ్​ చేసుకునేలా చర్యలు చేపడతామని వెల్లడించారు.

minister-harish-rao-on-rural-development-programs
రాష్ట్రంలో నీలివిప్లవం రాబోతుంది: మంత్రి హరీశ్ రావు

By

Published : Aug 11, 2020, 4:27 PM IST

కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్‌ కాకతీయలతో రాష్ట్రంలోని చెరువులు నిండుకుండలుగా మారాయని, రాబోయే రోజుల్లో తెలంగాణలో నీలివిప్లవం రాబోతుందని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. గ్రామాభివృద్ధే ధ్యేయంగా, కులవృత్తులకు ప్రోత్సాహం అందిస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే మత్స్యకారులకు వందశాతం సబ్సిడీతో చేపపిల్లలను పంపిణీ చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.

రాష్ట్రంలో నీలివిప్లవం రాబోతుంది: మంత్రి హరీశ్ రావు

మెదక్ జిల్లా రామాయంపేట ధర్మారం చెరువులో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డితో కలిసి చేప పిల్లలను వదిలారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 80 కోట్ల చేప పిల్లల పంపిణీ చేపట్టామని తెలిపారు. మత్స్యకారులు ప్రమాదవశాత్తు మృతి చెందితే వారికి 6 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా అందచేస్తామని అన్నారు. దళారులను ఆశ్రయించకుండా మత్స్యకారులే సొంతంగా మార్కెటింగ్ చేసుకునేలా చర్యలు చేపడతామని వెల్లడించారు. అనంతరం నూతన గ్రామపంచాయతీ భవనంతో పాటు డంప్‌ యార్డు, వైకుంఠధామాలను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు.

ఇదీ చూడండి:అమర జవాను కుటుంబానికి హైకోర్టు జోక్యంతో న్యాయం

ABOUT THE AUTHOR

...view details