మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలో మంత్రి హరీశ్‌రావు పర్యటించారు. సికింద్లాపూర్, దంతాన్‌పల్లిలో రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించారు. అనంతరం గుండ్లపల్లి విద్యుత్తు ఉపకేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి.. గోమారంలో ఏర్పాటు చేసిన హరితహారంలో పాల్గొని మొక్కలు నాటారు. దంతాన్‌పల్లిలో ఉన్న దేవాదాయ భూముల సమస్యను వెంటనే పరిష్కారించి, అర్హులకు పాసుపుస్తకాలివ్వాలని కలెక్టర్‌ను ఆదేశించారు. గ్రామాల్లో వైకుంఠధామాలను పదిహేను రోజుల్లోగా పూర్తి చేయాలని సర్పంచ్‌లకు సూచించారు.
ఉమ్మడి మెదక్ జిల్లాకు రూ.112 కోట్లు విడుదల: హరీశ్ - మంత్రి హరీశ్‌రావు వార్తలు
ఉమ్మడి మెదక్ జిల్లాలో 22 రోడ్ల నిర్మాణానికి రూ.112 కోట్లు మంజూరయ్యాయని మంత్రి హరీశ్ రావు తెలిపారు. నియోజకవర్గంలోని మూడు రోడ్లకు రూ.13 కోట్లు కేటాయించామని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. పనులు ప్రాధాన్యత క్రమంలో చేపట్టడుతామని స్పష్టం చేశారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో 22 రోడ్ల నిర్మాణానికి రూ.112 కోట్లు మంజూరయ్యాయని మంత్రి హరీశ్ రావు తెలిపారు. నియోజకవర్గంలోని మూడు రోడ్లకు రూ.13 కోట్లు కేటాయించామని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. రెండో విడతలో రెండు రోడ్లకు రూ.10 కోట్లు మంజూరు చేస్తామన్నారు. పనులు ప్రాధాన్యత క్రమంలో చేపట్టుతామని పేర్కొన్నారు. ఇందులో ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. హరితహారంలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ప్రజల్ని కోరారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, జడ్పీ ఛైర్పర్సన్ హేమలత, మాజీమంత్రి సునితారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధిలు, పాల్గొన్నారు.
ఇవీ చూడండి:భలే గిరాకీ.. మాస్కులతోపాటు ఫేస్ షీల్డ్స్‌కు పెరిగిన ఆదరణ