తెలంగాణ

telangana

ETV Bharat / state

పీహెచ్​సీలో మంత్రి ఆకస్మిక తనిఖీలు.. వైద్య సిబ్బంది చేసిన పనిపై.. - హరీశ్ రావు తనిఖీలు

Harish Rao in hospital: వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ఆకస్మాత్తుగా పీహెచ్​సీని సందర్శించారు. మెదక్ జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి టేక్మాల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆస్పత్రిలో అందిస్తున్న సదుపాయాలపై ఆరా తీశారు.

Harish Rao
వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు

By

Published : Apr 17, 2022, 5:27 PM IST

Harish Rao in hospital: మెదక్ జిల్లా పర్యటనలో ఉన్న వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ఆకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించారు. జిల్లాలోని టేక్మాల్ మండలకేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. సిబ్బందికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రిలో అందిస్తున్న వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు.

శనివారం రాత్రి ఓ మహిళకు సాధారణ ప్రసవం జరిగిందని స్థానిక నేతల ద్వారా తెలుసుకున్న మంత్రి పీహెచ్​సీని సందర్శించారు. తల్లి, బిడ్డ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రి పరిసరాలను పరిశీలించారు. ఆదివారం కూడా సిబ్బంది హాజరై పూర్తి సేవలు అందిస్తుండడం పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. రోగులకు అవసరమైన మందులు అందిస్తున్నామని.. ప్రసవం తర్వాత తల్లులకు కేసీఆర్ కిట్ ఇస్తున్నామని వైద్య సిబ్బంది మంత్రి హరీశ్ రావుకు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details