తెలంగాణ

telangana

ETV Bharat / state

అవినీతి రహిత పాలన అందిస్తాం: హరీశ్​ రావు - municipal Elections in telangana

అవినీతి రహిత.. పారదర్శక పరిపాలన అందిస్తామన్నారు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట, తూప్రాన్​లో మున్సిపల్​ ఎన్నికల ప్రచారం చేశారు.

minister harish rao campaign in sangareddy district
అవినీతి రహిత పాలన అందిస్తాం

By

Published : Jan 19, 2020, 4:37 PM IST

తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి.. అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓటు వేయాలని ఆర్థిక మంత్రి హరీశ్​ రావు ఓటర్లకు సూచించారు. మున్సిపల్​ ఎన్నికల ప్రచారంలో భాగంగా సదాశివపేట, తూప్రాన్​లో పర్యటించారు. పలు వార్డులు తిరిగి.. అభ్యర్థుల తరుఫున ఓట్లు అభ్యర్థించారు. అవినీతి రహిత.. పారదర్శక పరిపాలన అందిస్తామని ప్రజలకు హమీ ఇచ్చారు. తెరాసను ఓడించడం కోసం భాజపా-కాంగ్రెస్ అంతర్గత పోత్తు పెట్టుకున్నాయని ఆరోపించారు.

అవినీతి రహిత పాలన అందిస్తాం

ABOUT THE AUTHOR

...view details