తెలంగాణ

telangana

ETV Bharat / state

అభివృద్ధే పరమావధిగా సర్కారు అడుగులు : హరీశ్ రావు​ - మెదక్​ జిల్లాలో మంత్రి హరీశ్​ పర్యటన

అభివృద్ధే పరమావధిగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. మెదక్​ జిల్లా మల్లంపేట గ్రామంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు.

minister harish inaugurated some development work at mallampally village in medak district
గ్రామానికో హరితవనం.. అభివృద్ధి దిశగా అడుగులు: మంత్రి హరీశ్​

By

Published : Jul 18, 2020, 3:46 PM IST

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం మల్లంపేట గ్రామంలో నిర్మించిన డంప్​యార్డ్​ను మంత్రి హరీశ్​రావు ప్రారంభించారు. అనంతరం యూస్ పేటలో రెండు పడకల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపనతో పాటు ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సీఎం ఆదేశాల మేరకు గ్రామాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే ప్రతి గ్రామంలో డంప్​యార్డ్, వైకుంఠ ధామాలను నిర్మించామని మంత్రి తెలిపారు.

ఇవే కాక గ్రామానికో నర్సరీ, 24 గంటల విద్యుత్​, ఇంటింటికి స్వచ్ఛమైన తాగు నీటిని, చక్కటి సీసీరోడ్లు కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అలాగే ప్రతి పల్లెకు హరితవనాన్ని ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. అభివృద్ధే పరమావధిగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి హరీశ్​రావుతో పాటు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి :రాష్ట్రంలో 42 వేలు దాటిన కరోనా కేసులు.. 400పైగా మరణాలు

ABOUT THE AUTHOR

...view details