నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా ముందుకు వెళ్తోన్న మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి.. ప్రజా సమస్యల పరిష్కారానికి చేపట్టిన 'మీ కోసం నేనున్నా' కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోంది. బుధవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి వివిధ మండలాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఫోన్ల ద్వారా మరికొంత మంది వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
'మీ కోసం నేనున్నా' కార్యక్రమానికి అనూహ్య స్పందన - Medak News
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మెదక్ ఎమ్మెల్యే ప్రారంభించిన 'మీ కోసం నేనున్నా' కార్యక్రమానికి చక్కటి స్పందన లభిస్తోంది. పట్టణంలోని క్యాంపు కార్యాలయానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించుకుంటున్నారు. అధికారులతో మాట్లాడి ఆయా సమస్యలను సకాలంలో పరిష్కరిస్తున్నారు పద్మాదేవేందర్ రెడ్డి.
medak mla
సమస్యలపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే.. అక్కడే ఉన్న అధికారులతో మాట్లాడి వాటిని పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సాయిరాం, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, తహసీల్దార్ రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.