కరోనా వైరస్ వ్యాపిస్తున్నందున ‘మీ కోసం నేనుంటా’ అనే కార్యక్రమాన్ని మూడు గంటల వరకు మాత్రమే కుదించామని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి తెలిపారు. మే 16 నుంచి యథావిధిగా కొనసాగిస్తామని చెప్పారు.
కరోనా వల్ల 'మీకోసం నేనుంటా' కార్యక్రమం వాయిదా - medak mla padma devender reddy
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో 'మీకోసం నేనుంటా' అనే కార్యక్రమాన్ని మూడు గంటలు మాత్రమే కొనసాగించామని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి తెలిపారు. స్వీయ నియంత్రణ పాటిస్తూ.. పరిమిత లాక్డౌన్ విధించుకున్న వారికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
మెదక్ జిల్లా వార్తలు, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి
మెదక్ పట్టణంలో.. వ్యాపార, వాణిజ్య, హోటల్స్, తదితర సంస్థలు స్వచ్ఛందంగా స్వీయ నియంత్రణ విధించుకున్నాయని.. వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని, కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. మీకోసం.. నేనుంటా కార్యక్రమంలో భాగంగా.. రెవెన్యూ భూతగాదాలు, పింఛన్లకు సంబంధించిన వినతులు ఎక్కువ వచ్చినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.