తెలంగాణ

telangana

ETV Bharat / state

సూర్య గ్రహణం ఎఫెక్ట్​ : వనదుర్గా భవానీ ఆలయం మూసివేత - Suryagrahanam Vanadurgabhavani temple

సూర్య గ్రహణం సందర్భంగా మెదక్​ జిల్లా పాపన్నపేటలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వన దుర్గా భవానీ ఆలయాన్ని శనివారం సాయంత్రం 6 గంటలకు మూసివేయనున్నట్లు ఈవో శ్రీనివాస్​ తెలిపారు. తిరిగి ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఆలయం తెరుస్తామన్నారు.

వనదుర్గా భవానీ ఆలయం
వనదుర్గా భవానీ ఆలయం

By

Published : Jun 20, 2020, 3:08 PM IST

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వన దుర్గా భవానీ దేవస్థానాన్ని శనివారం సాయంత్రం 6 గంటలకు మూసివేయనున్నట్లు ఈవో సార శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం సూర్యగ్రహణం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

ఆదివారం ఉదయం నుంచి భక్తులకు ఎలాంటి దర్శనం ఉండదన్నారు. తిరిగి సాయంత్రం 4 గంటలకు సంప్రోక్షణల అనంతరం ఆలయం తెరుస్తామన్నారు. అభిషేకం, ఆరాధన, అర్చనలు నిర్వహించిన తర్వాత భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామని ఆలయ అర్చకులు, ఆలయ ఈవో తెలిపారు.

ఇదీ చూడండి:యుద్ధ వ్యూహాలతో శత్రు దేశాలను ఎదుర్కొందాం : సీఎం కేసీఆర్‌

ABOUT THE AUTHOR

...view details