తెలంగాణ

telangana

ETV Bharat / state

సైబర్​ నేరగాళ్ల నుంచి జాగ్రత్తగా ఉండాలి : ఎస్పీ చందన - crime news

సైబర్​ నేరగాళ్ల నుంచి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మెదక్​ ఎస్పీ చందన దీప్తి సూచించారు. ఆన్​లైన్​లో నేరగాళ్లు చూపే ఆశలకు, మోసాలకు గురికావొద్దని ఆమె తెలిపారు.

medak sp spoke on cyber crimes
'సైబర్​ నేరగాళ్ల నుంచి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి'

By

Published : Sep 15, 2020, 10:00 PM IST

ప్రస్తుత రోజుల్లో ఇంటర్నెట్​తోనే అన్నీ పనులు జరిగిపోతున్నాయి. ప్రజలు బయటికి వెళ్లకుండానే ఆన్​లైన్​లో షాపింగ్ చేసేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల నుంచి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మెదక్ ఎస్పీ చందన దీప్తి సూచించారు. ప్రజలు సైబర్ నేరగాళ్లు చూపే మోసపూరితమైన ఆశలకు, మోసాలకు గురికావొద్దన్నారు. కొంతమంది సైబర్ నేరగాళ్లు సామాన్య పేద ప్రజలను టార్గెట్ చేస్తూ ఆన్‌లైన్‌లో ఆహారం, ఇతర ఖరీదైన ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువుల విక్రయం, ఆఫర్ల పేరిట దోచేస్తున్నారని తెలిపారు.

ఆన్‌లైన్‌లో తక్కువ ధరలకే వస్తువులంటూ ఆశచూపి సైబర్ నేరగాళ్లు మరో కొత్తరకం మోసాలకు, నేరాలకు పాల్పడుతున్నారన్నారు. ప్రజలు ఆన్​లైన్​లో మోసగాళ్లు చూపే ఆశలకు మోసపోకుండా.. తమ కష్టార్జితాన్ని కాపాడుకోవాలన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా యువతీ యువకులు చెడుదారి పట్టకుండా ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులకు ఎస్పీ చందన దీప్తి సూచించారు.

ఇవీ చూడండి: చోరీ కేసులను ఛేదించిన బోధన్​ పోలీసులు

ABOUT THE AUTHOR

...view details