మెదక్ జిల్లాలో పూర్తి స్థాయి లాక్డౌన్కు పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ, ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు మెదక్ జిల్లా పోలీస్ యంత్రాంగం పని చేస్తుందని అన్నారు.
'లాక్డౌన్ పూర్తయ్యే వరకు బయటకు రావొద్దు' - 'లాక్డౌన్ పూర్తయ్యే వరకు బయటకు రావొద్దు'
మెదక్ జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు చేస్తూ… పూర్తి స్థాయి లాక్డౌన్కు ఎల్లవేళలా కృషి చేస్తున్నామని జిల్లా ఎస్పీ చందనాదీప్తి అన్నారు. ప్రజలందరూ లాక్డౌన్ పూర్తయ్యేవరకు బయటకు రాకూడదని కోరారు.

'లాక్డౌన్ పూర్తయ్యే వరకు బయటకు రావొద్దు'
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ను ప్రజలందరూ పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు. జిల్లా పోలీస్ శాఖ అన్ని ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ... కరోనా కట్టడికి ఎల్లవేళలా కృషి చేస్తోందని ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజూ వాహన తనిఖీలు చేస్తూ లాక్డౌన్ను ప్రశాంతంగా కొనసాగిస్తున్నామని అన్నారు.
ఇవీ చూడండి:రాష్ట్రంలో మరో 13 కరోనా పాజిటివ్ కేసులు