తెలంగాణ

telangana

ETV Bharat / state

మెదక్​ పట్టణ కూడళ్లలో ఆర్టీసీ డీఎం ప్రచారం - rtc news

'ఆర్టీసీ కార్గో సేవలు వినియోగించుకోండి.. సంస్థ అభివృద్ధికి తోడ్పడంటూ' మెదక్​ పట్టణంలో డీఎం జాకీర్​ హుస్సేస్​ ప్రచారం నిర్వహించారు. పట్టణ ప్రధాన కూడళ్లలోని వ్యాపారులకు కార్గో సర్వీసుల గురించి వివరించారు.

మెదక్​ పట్టణ కూడళ్లలో ఆర్టీసీ డీఎం ప్రచారం
మెదక్​ పట్టణ కూడళ్లలో ఆర్టీసీ డీఎం ప్రచారం

By

Published : Jul 16, 2020, 7:28 PM IST

ఆర్టీసీ ఆధ్వర్యంలో చేపట్టిన పార్సిల్ కార్గో కొరియర్ సేవలను వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలని మెదక్ డిపో మేనేజర్ జాకీర్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు. గురువారం మెదక్ పట్టణంలోని వివిధ కూడళ్ల వద్ద ప్రచారం నిర్వహించారు. అందుబాటు ధరల్లో, సురక్షితమైన కార్గో సేవలను పట్టణ వాసులు వినియోగించుకోవాలని, సంస్థకు ఆర్థికంగా తోడ్పాటును అందించాలన్నారు.

కార్గోసేవల గురించి పట్టణ వాసులకు, వ్యాపారులకు అవగాహన కల్పించారు. పట్టణమంతా తిరుగుతూ సేవలు ఎలా వినియోగించుకోవాలో వివరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ ప్రవీణ్ కుమార్, సిబ్బంది సుభాశ్​ చంద్రబోస్ తదితరులు ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details