తెలంగాణ

telangana

ETV Bharat / state

అడుగడుగునా గుంతలే.. ముందుకు సాగేదెట్ల? - మెదక్​ జిల్లా వార్తలు

మెదక్​ జిల్లా కేంద్రంలో ప్రధాన రహదారులతో పాటు.. అంతర్గత రహదారులు కూడా గుంతలు గుంతలుగా మారడం వల్ల ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మొన్నటి వర్షాలకు ఆ గుంతల్లో బురద నీరు చేరి.. అటుగా వెళ్లాలంటేనే భయపడుతున్నారు. రోడ్డు సరిగ్గా లేకపోవడం వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని పట్టణ ప్రజలు వాపోతున్నారు.

Medak Roads Destroyed With Heavy Rains
అడుగడుగునా గుంతలే.. ముందుకు సాగేదెట్ల?

By

Published : Aug 25, 2020, 3:19 PM IST

మెదక్‌ జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రోడ్లు అధ్వానంగా మారడం వల్ల వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల వారం రోజుల పాటు కురిసిన వర్షాలకు మిషన్‌ భగీరథ కోసం తీసిన గుంతల్లో నీరు చేరి పరిస్థితి మరింత దిగజారింది. మెదక్‌-హైదరాబాద్‌ ప్రధాన రహదారి గుంతలమయం కావడంతో వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. వెంటనే మరమ్మత్తులు చేయించి గుంతల రోడ్ల బాధ తప్పించాలని కోరుతున్నారు.

మెదక్​-హైదరాబాద్​ రహదారికి ఇరువైపుల గుంతలను రాతి మట్టితో పూడ్చి తాత్కాలిక సమస్యను పరిష్కరించామని, వర్షాల వల్ల చెడిపోయిన రోడ్ల పరిస్థితిని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి త్వరలో పటిష్టంగా మరమ్మతులు చేయించి సమస్య పరిష్కరిస్తామని మెదక్​ పురపాలక సంఘం ఛైర్మన్​ చంద్రపాల్​ తెలిపారు.

ఇవీ చూడండి:దిల్లీలో ఐటీ మంత్రి కేటీఆర్.. కేంద్ర మంత్రి హర్​దీప్​సింగ్​ పూరీతో భేటీ

ABOUT THE AUTHOR

...view details