శాంతిభద్రతల పరిరక్షణలో కఠినంగానే కాదు.. విపత్కర పరిస్థితుల్లో పేద, బడుగు జీవులకు అండగా నిలుస్తూ మానవత్వం చాటారు మెదక్ పోలీసులు. కరోనా లాక్‌డౌన్ సమయంలో పనులు లేక పూట గడవని పేదలకు, జిల్లా, రాష్ట్రాల సరిహద్దులు దాటి బతుకుదెరువు కోసం వచ్చిన వలస కూలీలకు, భిక్షాటన చేసే వాళ్లను నిత్యావసర సరుకులు, ఆహారం పంపిణీ చేశారు.
నిత్యావసర సరుకులు పంచిన పోలీసులు - MEDAK POLICE HELPS POOR PEOPLE IN LOCK DOWN PERIOD
మెదక్ జిల్లా రామాయంపేట, నిజాంపేట మండలాల్లో పోలీసులు నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంచారు.
![నిత్యావసర సరుకులు పంచిన పోలీసులు MEDAK POLICE HELPS POOR PEOPLE IN LOCK DOWN PERIOD](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6700961-64-6700961-1586272144627.jpg)
నిత్యావసర సరుకులు పంచిన పోలీసులు
ఎస్పీ చందన దీప్తి ఆధ్వర్యంలో రామాయంపేట సీఐ నాగార్జున బృందం 400 మంది కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. సంకల్ప్ ఫౌండేషన్ అనే గ్రూప్ ఏర్పాటు చేసి దాతలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో పేదలకు సేవ చేస్తున్నారు. 100కు కాల్ చేస్తే నిమిషాల వ్యవధిలో మీ ముందుంటామన్నారు ఇక్కడి పోలీసులు. దామరచెరువు, సుతార్ పల్లి, శివాయిపల్లి మరియు రైలాపూర్ గ్రామాలలో సరుకులను అందించామని, మిగతా గ్రామాల్లో మరో రెండు రోజుల్లో నిత్యావసరాలు పంచుతామన్నారు.
నిత్యావసర సరుకులు పంచిన పోలీసులు
ఇదీ చూడండి:లాక్‌డౌన్ పొడిగింపు దిశగా కేంద్రం ఆలోచన