తెలంగాణ

telangana

ETV Bharat / state

నర్సాపూర్​ దారిదోపిడీ కేసులో నిందితులు అరెస్ట్​

సినమా ఫక్కీలో దోపిడీకి యత్నించి పోలీసులకు అడ్డంగా చిక్కింది ఓ ముఠా. ఓ వ్యక్తిని పథకం ప్రకారం దోచుకునేందుకు యత్నించిన ముఠాను మెదక్​ జిల్లా నర్సాపూర్​ పోలీసులు చాకచక్యంతో పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టారు.

నర్సాపూర్​ దారిదోపిడీ కేసులో నిందితులు అరెస్ట్​

By

Published : Nov 25, 2019, 10:23 PM IST

మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రాంతంలో జరిగిన దాడి దోపిడి కేసును పోలీసులు నెల రోజుల వ్యవధిలోనే ఛేదించారు. నలుగురి నిందితులను అరెస్టు చేసిన నర్సాపూర్​ పోలీసులు రిమాండ్​కు తరలించారు.

హైదరాబాద్ నగర పరిసరాల్లోని బాచుపల్లికి చెందిన హిమాన్​ సింగ్ అనే వ్యాపారిని బెదిరించి డబ్బులు వసూలు చేద్దామని పథకం వేసిన దర్శన్, ఆనంద్, వెంకటేష్, విజయ్​లు పోలీసులకు చిక్కారు. బాధితుడిని కిడ్నాప్​ చేసేందుకు యత్నించగా ప్రయత్నం బెడిసికొట్టి బాధితుడి సెల్​ఫోన్​, కారు ఎత్తుకుపోయారు. చరవాణి సిగ్నల్​ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించినట్లు డీఎస్పీ కిరణ్​కుమార్​ తెలిపారు.

నర్సాపూర్​ దారిదోపిడీ కేసులో నిందితులు అరెస్ట్​

ఇదీ చూడండి: యజమాని ఇంట్లో 60 లక్షలు చోరీ చేసిన దొంగల అరెస్టు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details